Shumban Gill : తొలి టెస్టులో విజయం దిశగా సాగుతున్న భారత జట్టుకు షాక్. రెండో రోజు రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shumban Gill) మూడో రోజు ఆటకు దూరం కానున్నాడు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న గిల్ ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. అయితే.. విశ్రాంతి సూచించిన నేపథ్యంలో అతడు మ్యాచ్‌లో ఆడడు. అతడి గైర్హాజరీలో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) జట్టును నడిపించనున్నాడు.
రెండోరోజు వాషింగ్టన్ సుందర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన గిల్ నాలుగు పరుగుల వద్ద స్వీప్ షాట్ ఆడబోయాడు. కానీ, సిమన్ హార్మర్ సంధించిన బంతిని అంచనా వేయలేకపోయాడు. షాట్ మిస్ కావడంతో బంతి గిల్ అతడి మెడకు గట్టిగా తాకింది. ఫిజియో వచ్చి పరీక్షించినా నొప్పి తగ్గకపోవడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. మొదట డ్రెస్సింగ్ రూమ్‌లో అతడికి వైద్యం అందించారు. కానీ, సాయంత్ర కూడా టీమిండియా సారథి అసౌకర్యంగా కనిపించాడు. దాంతో.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
🚨 Update 🚨
Shubman Gill has a neck spasm and is being monitored by the BCCI medical team. A decision on his participation today will be taken as per his progress.
Updates ▶️ https://t.co/okTBo3qxVH #TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/ivd9LVsvZj
— BCCI (@BCCI) November 15, 2025
‘గిల్ గాయం తీవ్రతపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. మెడ ద్రుఢంగా ఉండేందుకు అవసరమైనవి చేయాల్సి ఉంది. నిద్రలేమి కూడా సమస్యకు కారణం కావచ్చు. అయితే.. గిల్ గాయం ఏమంత పెద్దది కాదని నేను భావిస్తున్నా’ అని మోర్కెల్ చెప్పాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో భారత స్పిన్నర్లు మ్యాచ్‌ను మలుపుతిప్పారు. తొలి ఇన్నింగ్స్‌లో 189కే ఆలౌట్ అయిన భారత్.. రవీంద్ర జడేజా విజృంభణతో దక్షిణాఫ్రికాను దెబ్బతీసింది. జడ్డూ నాలుగు వికెట్లతో చెలరేగగా సఫారీ టీమ్ ఆలౌట్ అంచున నిలిచింది. రెండో రోజు ఆట ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 93 రన్స్ చేసిన పర్యాటక జట్టు 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు తొలి సెషన్లో బవుమా బ్యాచ్‌ను ఆలౌట్ చేస్తే.. భారీ విజయం టీమిండియా ఖాతాలో చేరినట్టే.