కరాచీ: పాకిస్థాన్ ఓపెనింగ్ బ్యాటర్ ఫకర్ జమాన్(Fakhar Zaman).. చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం భారత్‌తో జరగనున్న వన్డే మ్యాచ్‌కు దూరం అయ్యాడు. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఫకర్ జమాన్ గాయపడ్డ విషయం తెలిసిందే. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపబోయిన అతను.. కిందపడి గాయపడ్డాడు. అయితే ఫిబ్రవరి 19వ తేదీన భారత్‌తో జరిగే కీలకమైన మ్యాచ్‌కు అతను దూరం అయ్యాడు. భారత్ తన మ్యాచులన్నీ దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. కరాచీ నుంచి ఇవాళ పాకిస్థాన్ జట్టు దుబాయ్‌కు బయలుదేరి వెళ్లింది. ఆ బృందంలో గాయపడ్డ ఫకర్ జమాన్ లేడు. దీంతో రెగ్యులర్ ఓపెనర్‌ను పాక్ జట్టు కోల్పోయింది.
కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫకర్ జమాన్.. ఓపెనింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. అతని స్థానంలో సౌద్ షకీల్ ఓపెనర్‌గా వచ్చాడు. నెంబర్ ఫోర్ స్థానంలో బ్యాటింగ్ చేసిన ఫకర్ జమాన్.. 41 బంతుల్లో 24 రన్స్ చేసి ఔటయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతను తీవ్ర ఇబ్బంది పడ్డాడు. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 60 రన్స్ తేడాతో ఓడింది. ఫకర్ జమాన్ గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి త్వరలో ప్రకటన చేయనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
చాంపియన్స్ ట్రోఫీ కోసం ఫకర్ జమాన్.. మళ్లీ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. అతను చివరిసారి 2023 వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌గా ఆడాడు. తరుచూ ఫకర్ జమాన్ మోకాలి నొప్పులతో బాధపడుతున్నాడు. జమాన్ స్థానంలో ఓపెనర్‌గా ఇమామ్ ఉల్ హక్‌ను తీసుకునే ఛాన్సు ఉంది. పాకిస్థాన్ జట్టులో దూకుడు బ్యాటర్‌గా ఫకర్ జమాన్‌కు గుర్తింపు ఉన్నది. ఇండియాతో మ్యాచ్‌కు అతను దూరం కావడంతో.. పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌కు మళ్లీ కొత్త సమస్యలు వచ్చినట్లు అయ్యింది.