Simi Singh : ఐర్లాండ్ క్రికెటర్ సిమీ సింగ్ (Simi Singh) చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అంతుచిక్కని జ్వరంతో బాధ పడుతున్న అతడు అతడు ప్రస్తుతం ఐసీయూ(ICU)లోఉన్నాడు. జన్మతః భారతీయుడు అయిన సమీ.. ఐర్లాండ్ నుంచి మెరుగైన వైద్యం కోసం స్వదేశంలోని హర్యానాకు వచ్చాడు. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానా వైద్యులు అతడి కాలేయం (Liver) పూర్తిగా దెబ్బతిన్నదని తేల్చారు. దాంతో, కాలేయం మార్పిడికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..? ఆరు నెలల క్రితం సిమీ తీవ్రమైన జ్వరం వచ్చింది. దాంతో, వెంటనే ఐర్లాండ్ క్రికెట్ సిబ్బంది అతడిని డబ్లిన్‌లోని పెద్ద దవాఖానలో చేర్పించారు. కానీ, అక్కడి వైద్యులకు ఆ జ్వరం ఏంటో అంతుచిక్కలేదు. దాంతో, వాళ్లు సిమీకి చికిత్స చేయలేమని తేల్చి చెప్పారు. దాంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో సిమీ స్వదేశం వచ్చేశాడు.
☘️ A mid-career epiphany
☘️ T20 match ups
🏏 The psychology and motivation behind bowlingLater than hoped, but it’s here. Welcome to The Part-Timer, a brand new podcast about Irish cricket. @SimiSingh147 is the guest on the first ever episode. https://t.co/Wua2nOTDSt pic.twitter.com/uGorzy6oTy
— Nathan Johns (@nathanrjohns) February 17, 2022
‘సిమీకి అంతు చిక్కని జ్వరం వచ్చింది. ఐర్లాండ్‌లో వైద్యులు చేతులెత్తేశారు. అప్పటికే అతడి పరిస్థితి రోజు రోజుకు క్షీణించ సాగింది. అందుకని మేము అతడిని మెరుగైన వైద్యం కోసం భారత్‌కు తీసుకొచ్చాం’ అని సిమీ మామ పర్వీందర్ సింగ్ తెలిపాడు.
ఐర్లాండ్ నుంచి రాగానే సిమీని హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానలో అడ్మిట్ చేశారు. అతడిని అన్ని పరీక్షలు చేసిన వైద్యులు కాలేయం పనితీరు ఆ జ్వరానికి కారణమని కనుగొన్నారు. కాలేయాన్ని మార్పిడి చేస్తే తప్ప బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. అందువల్ల అతడి భార్య అగమ్‌దీప్ కౌర్ తన కాలేయాన్ని కొంత వరకూ ఇచ్చేందుకు సిద్ధపడినట్టు సమాచారం. దాంతో, త్వరలోనే సిమీ సింగ్‌కు సర్జరీ చేసి కొత్త కాలేయాన్ని అమర్చనున్నారు. సిమీ 2017లో ఐర్లాండ్ తరఫున అరగేట్రం చేశాడు. స్పిన్నర్ అయిన అతడు ఇప్పటివరకూ ఆ దేశం తరఫున 35 వన్డేలు, 53 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.