Govt Employees | బిగ్ బ్రేకింగ్.. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.02 కోట్ల ప్రమాద బీమా..!
Govt Employees : రాష్ట్రంలోని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమా(Accident Insurance)ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) తెలిపారు.
Govt Employees : రాష్ట్రంలోని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమా(Accident Insurance)ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భట్టి వెల్లడించారు. రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిశాయని డిప్యూటీ సీఎం వివరించారు.
ఉద్యోగులకు ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో పరిధిలోని ఉద్యోగులందరికీ రూ.కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. తద్వారా ఇప్పటికే సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, వీరితోపాటు విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని భట్టి గుర్తు చేశారు. ఇదే తరహాలో ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు సైతం రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అమల్లోకి తీసుకు వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. దాంతో.. 5.14 లక్షల మందికి లబ్ది పొందుతారని భట్టి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

