హైదరాబాద్, ఆట ప్రతినిధి: రష్యా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ గేమ్స్‌లో భారత యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ కాంస్య పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో స్నేహిత్ 0-3(9-11, 8-11, 6-11)తో కిరిల్ షచ్కోవ్(రష్యా) చేతిలో ఓడి కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.
అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో స్నేహిత్ 3-2(11-2, 11-8, 6-11, 10-12, 11-8)తో భారత్‌కే చెందిన జీత్చంద్రను ఓడించాడు.