హాంగ్జొ (చైనా): మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జైత్రయాత్రకు బ్రేకులు పడ్డాయి. టోర్నీలో అపజయమన్నదే లేకుండా సాగుతున్న భారత్‌కు సూపర్-4 దశలోని రెండో మ్యాచ్‌లో చైనా షాకిచ్చింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చైనా..4-1తో భారత్‌ను ఓడించింది.
భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ (33వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా జో మీరంగ్ (4, 56 ని.), చెన్ యాంగ్ (31 ని.), జిన్జువాంగ్ (49 ని.) గోల్స్ చేశారు.