ICC Rankings | టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కెరియర్లో తొలిసారిగా కెరియర్లో ఉత్తమ ర్యాంక్ సాధించాడు. ఐసీసీ బెస్ట్ నెంబర్ వన్‌గా బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ బుధవారం టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడిగా నిలిచాడు. ర్యాంకింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మూడు స్థానాలను ఎగబాకారు. వరుణ్ గతేడాది ఫిబ్రవరిలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. మార్చి నుంచి అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కు బౌలర్ జాకబ్ డఫీని అధిగమించి నెంబర్ వన్‌గా నిలిచాడు.
తాజాగా యూఏసీ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసి బౌలర్ల ర్యాంకింగ్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. వరుణ్ చక్రవర్తి స్థిరమైన ఫామ్‌ను కొనసాగిస్తూ టీ20ల్లో నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నారు. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 12వ స్థానానికి చేరుకున్నాడు. బుమ్రా 40వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ తన ర్యాంకులు పదిలం చేసుకున్నాడు. యూఏఈపై 16 బంతుల్లో 30 పరుగులు, పాక్‌పై 13 బంతుల్లోనే 31 పరుగులు చేసి కెరియర్లోనే అత్యధికంగా 884 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకొని 39వ స్థానానికి చేరాడు. అయితే, తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ర్యాంకులు దిగజారాయి. తిలక్ రెండుస్థానాలు దిగజారి నాలుగో స్థానానికి, సూర్యకుమార్ ఒక స్థానం దిగజారి ఏడో ర్యాంకుకు చేరాడు. ఆసియా కప్ జట్టులో చోటు దక్కని యశస్వి జైస్వాల్ సైతం రెండు స్థానాలు దిగజారి 13వ స్థానికి చేరుకున్నాడరు. మాంచెస్టర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఇంగ్లాండ్ ఓపెనింగ్ జోడీ ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ వరుసగా ఒక స్థానం ఎగబాకి రెండు, మూడు స్థానాలకు చేరారు.