ముంబై: వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టు.. ఆ ప్రయాణాన్ని ఐర్లాండ్ టూర్‌తో ప్రారంభించనుంది. ఈ ఏడాది జూన్‌లో టీమ్ఇండియా.. ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడేందుకు గాను ఆ దేశం పర్యటించనుంది. ఈ మేరకు శనివారం బీసీసీఐ వివరాలు వెల్లడించింది.
ఆ దేశంతో జూన్ 26, 28న బెల్ఫాస్ట్ వేదికగా భారత జట్టు రెండు టీ20లు ఆడుతుందని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. 2018, 2022, 2023 తర్వాత ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుండటం భారత్‌కు ఇదే మొదటిసారి. కాగా ఐపీఎల్ ముగిసిన వెంటనే శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత టెస్టు, వన్డే జట్టు.. స్వదేశంలో ఆఫ్గానిస్థాన్‌తో ఆ రెండు ఫార్మాట్లలో మ్యాచ్‌లు ఆడనున్న విషయం విదితమే.