ఢిల్లీ: ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనలతో సత్తా చాటుతున్న భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) పురుషుల ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంది.
ఇటీవలే ముగిసిన థాయ్‌లాండ్ ఓపెన్‌కు ముందు మూడో స్థానంలో ఉన్న ఈ జోడీ..ఆ టోర్నీలో టైటిల్ గెలవడంతో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 99,670 పాయింట్లతో భారత జోడీ టాప్‌లో ఉండగా చైనా జోడీ వి కెంగ్, వాంగ్ చెంగ్ రెండో స్థానంలో ఉన్నారు.