WTT | పనాజీ: తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ.. వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. గోవా వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ ప్రి క్వార్టర్స్‌లో శనివారం ప్రపంచ 66వ ర్యాంకర్ శ్రీజ 3-1 (12-10, 8-11, 11-8, 11-8)తో 36వ ర్యాంకర్ డో హోయి కిమ్ (హాంకాంగ్)పై విజయం సాధించింది.
మరోవైపు స్టార్ ప్యాడ్లర్లు మనికా బాత్రా, అర్చనా కామత్ పరాజయం పాలయ్యారు.