ముంబై : ఏఎఫ్సీ మహిళల ఏషియన్ కప్ ఆస్ట్రేలియా 2026 క్వాలిఫయర్స్ టోర్నీకి భారత జట్టును ఎంపిక చేశారు. సోమవారం 24 మందితో ప్రకటించిన భారత జట్టులో తెలంగాణ యువ ఫుట్‌బాలర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది. ఇటీవలే ఏఐఎఫ్ఎఫ్ అత్యుత్తమ ఫుట్‌బాలర్ అవార్డు అందుకున్న సౌమ్య..
టీమ్ఇండియాకు కీలకంగా వ్యవహరించనుంది. ఫార్వర్డ్‌గా సౌమ్య సేవలను ఉపయోగించేందుకు భారత ఫుట్‌బాల్ జట్టు సిద్ధమైంది. క్రిస్పిన్ ఛెత్రీ చీఫ్ కోచ్‌గా వ్యవహరించనుండగా, ప్రియ, నివేత రామాదాస్ సహాయక కోచ్‌లుగా ఎంపికయ్యారు.