బెంగళూరు: భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పూర్తి స్థాయి క్రికెట్ ఆడేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. కీలకమైన ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు దేశవాళీ రంజీ టోర్నీ ద్వారా సన్నద్ధం కావాలనుకున్న షమీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.
బుధవారం నుంచి చిన్నస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరిగే మ్యాచ్‌తో పాటు మధ్యప్రదేశ్ పోరుకు ఎంపిక చేసిన బెంగాల్ జట్టులో షమీకి చోటు దక్కలేదు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన షమీ తాను 100 శాతం ఫిట్నెస్తో ఉన్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.