ధర్మశాల: టీమిండియా కెప్టెన్సీ అందుకున్న తర్వాత శుభ్‌మన్ గిల్ (66 బంతుల్లో 11ఫోర్లు, 2 సిక్సర్లతో 84 నాటౌట్) బ్యాట్‌తో అదరగొడతున్నాడు. ఐపీఎల్, టెస్టు ఫామ్‌ను కొనసాగిస్తూ క్లాసిక్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో అఫ్గానిస్థాన్‌తో వనే ్డసిరీస్ను భారత్ అదిరిపోయే విజయంతో ఆరంభించింది. ధర్మ శాల స్టేడియంలో శనివారం వర్షం అంతరాయం మధ్య సాగిన తొలి వన్డేలో7 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను చిత్తు చేసింది. 25 ఓవర్లకు కుదించిన ఈ పోరులో 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.5 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయిఛేదించింది. కేఎల్ రాహుల్(19 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లతో 39 నాటౌట్), ఇషాన్(34) కూడా రాణించారు. తొలుత రెహ్మనుల్లా గుర్బాజ్ (51 బంతుల్లో 8ఫోర్లు, 8 సిక్సర్లతో 102) మెరుపు సెంచరీతో అఫ్గన్ 24.5 ఓవర్లలో 194 రన్స్‌కు ఆలౌటైంది. భారత అరంగేట్రం బౌలర్లు గుర్నూర్ బ్రార్(3/27), హర్ష్‌దూబే(3/47) మూడేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ 17న లక్నోలో జరుగనుంది.
గిల్ జోరు
అఫ్గ్గాన్తో టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్న గిల్ వైట్ బాల్ ఫార్మాట్లోనూ అదే ఊపు చూపించాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ(16) ఛేదన ఆరంభంలోనే రనౌట్ రూపంలో నిరాశపరిచినా.. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ జతగా దూకడుగా ఆడాడు. ఇద్దరూ అఫ్గ్గాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలు బాదారు. శుభ్‌మన్ తన మార్కు క్లాసిక్ షాట్లతో 37 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన రషీద్‌ఖాన్..కిషన్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. చాలా రోజుల తర్వాత వన్డేల్లోకి వచ్చిన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(12) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. అయినా మరో ఎండ్‌లో శుభ్‌మన్ అందమైన షాట్లతో తన ధాటిని కొనసాగించగా.. అతనికి రాహుల్ తోడయ్యాడు. తన స్టయిల్‌కు భిన్నంగా రాహుల్ దూకుడు చూపెట్టాడు. 22వ ఓవర్లో రెహమాన్‌ను లక్ష్యంగా చేసుకుంటూ వరుసగా 6,4,4,6తో 20 పరుగులు పిండుకున్నాడు. అదే ఊపులో అజ్మతుల్లా ఓమర్జాయ్య బౌలింగ్‌లో గిల్ ఫోర్ కొట్టగా..రాహుల్ 4,4తో మ్యాచ్ ముగించాడు.
గుర్బాజ్ ధనాధన్
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ హీరోగా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ను ముందుండి నడిపించాడు. అర్ష్‌దీప్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఫోర్, సిక్స్‌తో తన ఉద్దేశమేంటో చెప్పాడు. భారత పేసర్ గుర్నూర్ తన తొలి ఓవర్లోనే ఇబ్రహీం జద్రాన్(1)ను ఔట్ చేయగా.. అర్ష్‌దీప్ వరుస ఓవర్లలో అటల్(0), రెహమత్ షా(3)ను పెవిలియన్ చేర్చి 26/3తో అఫ్గ్గాన్ను కష్టాల్లోకి నెట్టాడు.అయినా గుర్బాజ్ వెనక్కుతగ్గలేదు. కెప్టెన్ హష్మతుల్లా(27)తో కలిసి ముందుకు నడిపించాడు. స్పిన్నర్ హర్ష్‌దూబే 8వ ఓవర్లో 4,6 కొట్టిన అతను.. ప్రసిధ్ ఓవర్లో 4,4తో25 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత గేర్ మార్చిన గుర్బాజ్.. భారీ షాట్లతో విరుచుకుపడి 48 బంతుల్లోనే వంద మార్క్ అందుకుని అఫ్గన్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న గుర్బాజ్‌ను నితీశ్..క్లీన్‌బౌల్డ్ చేయడంతో నాలుగో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత బ్రార్, హర్ష్‌దూబే, నితీశ్ చెలరేగడంతో అఫ్గానిస్థాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆలౌటైంది.
సంక్షిప్త స్కోర్లు: అఫ్గానిస్థాన్: 24.5 ఓవర్లలో 194 ఆలౌట్ (గుర్బాజ్ 102, బ్రార్ 3/27, దూబే 3/47), భారత్: 22.5 ఓవర్లలో 195/3(గిల్ 84 నాటౌట్, రాహుల్ 39 నాటౌట్, రషీద్ 1/37)
వాట్ ఏ క్యాచ్ గిల్..

ఈ మ్యాచ్‌లో గిల్ ఓ అద్భుత క్యాచ్ తో ఫిదా చేశాడు. 22వ ఓవర్లో హర్ష్ దూబే వేసిన బంతిని అఫ్గాన్ బ్యాటర్ అల్లా గజన్ఫర్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. టాప్ ఎడ్జ్ తీసుకున్న బాల్ అత్యంత వేగంగా ఫస్ట్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. ఆ సమయంలో గిల్ మెరుపు వేగంతో ఎడమ వైపునకు గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్‌ను ఒడిసిపట్టుకోవడంతో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులంతా షాకయ్యారు.