ఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించే సంస్థలకు ఇకనుంచి మరింత భారం పడనుంది. బీసీసీఐ మ్యాచ్ స్పాన్సర్షిప్ రేట్లను మరింత పెంచడమే ఇందుకు కారణం. ద్వైపాక్షిక సిరీస్‌ల మ్యాచ్‌లకు రూ. 3.5 కోట్లు.. ఐసీసీ, ఆసియా కప్ వంటి ఈవెంట్లలో మ్యాచ్‌లకు రూ. 1.5 కోట్లుగా నిర్ణయించింది. ఇన్నాళ్లూ ఇది రూ. 3.17 కోట్లు, రూ. 1.12 కోట్లుగా ఉండేది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటంతో టీమ్ఇండియా టైటిల్ స్సాన్సర్ నుంచి డ్రీమ్ 11 అర్ధాంతరంగా తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం టెండర్ల ప్రక్రియను ప్రారంభించిన విషయం విదితమే. మూడేండ్లకు డ్రీమ్ 11 ఒప్పందం రూ. 358 కోట్లు కాగా తాజా పెంపుతో అది కాస్తా రూ. 400-రూ. 450 కోట్ల వరకూ ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.