సింగపూర్: ఏషియా కప్ రెండో అంచె జూనియర్ విభాగంలో భారత ఆర్చర్లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల విభాగం సెమీస్‌లో కుశాల్ దలాల్.. 147-143తో హిము బచర్ (బంగ్లాదేశ్) ను ఓడించి ఫైనల్ చేరాడు. మహిళల సింగిల్స్ సెమీస్‌లో షణ్ముఖి.. 145-139తో యురికె (ఇండోనేషియా)ను ఓడించింది.
మహిళల సింగిల్స్ ఫైనల్ పోరు షణ్ముఖితో పాటు భారత్‌కే చెందిన తేజల్ మధ్యే జరుగనుండటంతో పసిడి, రజతం రెండూ బారత్కే దక్కనున్నాయి.