India | అంటల్య : టర్కీలోని అంటల్య వేదికగా జరుగుతున్న ‘ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫయర్స్’లో భారత పురుషుల రికర్వ్ జట్టు సైతం మహిళల బాటే నడిచింది. శనివారం జరిగిన ఈవెంట్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత్.. 4-5తో మెక్సికో చేతిలో అపజయం పాలైంది.
తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకున్న భారత షూటర్లు తర్వాత తడబడి మూల్యం చెల్లించుకున్నారు. శుక్రవారం ఇదే టోర్నీలో మహిళల రికర్వ్ జట్టు ఉక్రెయిన్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఇక పారిస్ ఒలింపిక్స్‌లో టీమ్ కోటా దక్కాలంటే భారత్‌కు ఉన్న ఆఖరి అవకాశం ఈనెల 24న వెల్లడించే ర్యాంకుల తర్వాతే తేలనుంది.