వడోదరా:డబ్ల్యూటీటీ యూత్ కం టెండర్ చాంపియన్షిప్లో భారత యువ ప్యాడ్లర్లు సిండ్రె లా దాస్, రూపమ్ సర్దార్ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన బాలికల అండర్-17 విభాగం ఫైనల్లో సిండ్రెలా 11-3, 9-11, 11-9, 11-8తో హాసిని మతన్పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన సిండ్రెలా స్థాయికి తగ్గ ఆటతీరుతో ప్రత్యర్థిపై అలవోక విజయం సాధించింది. బాలుర తుది పోరులో రూప మ్ సర్దార్ 11-8, 6-11, 11-5, 11-3తో సోహమ్పై గెలిచాడు.