దుబాయ్: భారత యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో తనకు తిరుగులేదని చాటిచెప్పాడు. ప్రత్యర్థి ఎవరన్నది సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్న సూర్య ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. సూపర్‌ఫామ్ మీదున్న సూర్య ప్రస్తుతం 863 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు.
ఈ డాషింగ్ క్రికెటర్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. విరాట్ కోహ్లీ తర్వాత అగ్రస్థానం అధిష్టించిన రెండో భారత బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెటర్ రిజ్వాన్ (842)ను రెండో ర్యాంక్‌కు పరిమితం చేస్తూ టాప్ ర్యాంక్‌లోకి దూసుకెళ్లాడు.