కొలరాడో (యూఎస్ఏ): అమెరికా వేదికగా జరిగిన మొదటి అండర్-19 వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్లు పతకాల పంట పండించారు. ఈ టోర్నీలో భారత్ ఏకంగా 17 పతకాలు సాధించింది.
పార్థవి (65 కి.), వంశిక (80 కి.), క్రిషా (75 కి.) మహిళల విభాగంలో మెరవగా పురుషుల విభాగంలో హేమంత్ సంగ్వాన్ (90 కి.) పసిడి పంచ్ విసిరాడు. మరో 8 మంది బాక్సర్లు (నిషా, సుప్రియా, క్రితిక, చంచల్, అంజలి, విని, ఆకాంక్ష, రాహుల్) రజతాలు సాధించారు. రిషి సింగ్, క్రిష్, సుమిత్, లక్ష్య, ఆర్యన్ కాంస్యాలు నెగ్గారు.