న్యూఢిల్లీ: ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత యువ అథ్లెట్ రెజోనా మల్లిక్ హీనా పసిడి కాంతులు విరజిమ్మింది. కొరియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 400 మీటర్ల పరుగులో ఆదివారం హీన అగ్రస్థానంలో నిలిచింది.
పురుషుల డిస్కస్ త్రోలో భరత్‌ప్రీత్ సింగ్ స్వర్ణం నెగ్గగా.. మహిళల 5000 మీటర్ల రేస్‌లో అంతిమ పాల్ కాంస్యం గెలుచుకుంది. 16 ఏండ్ల హీనా 53.31 సెకన్లలో లక్ష్యాన్ని చేరి బంగారు పతకం గెలుచుకోగా.. డిస్కస్ త్రోలో భరత్‌ప్రీత్ డిస్క్‌ను 55.66 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ పట్టాడు.