TT Championship | అస్తానా: ఏషియన్ టీటీ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. టోర్నీ చరిత్రలో తొలిసారి కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో జపాన్ చేతిలో 1-3 తేడాతో ఓటమితో భారత్‌కు కాంస్య దక్కింది. మరోవైపు పురుషుల క్వార్టర్స్‌లో భారత్ 3-1తో కజకిస్థాన్‌పై గెలిచి వరుసగా మూడోసారి కాంస్య ఖాయం చేసుకుంది.
గురువారం జరిగే సెమీస్‌లో చైనీస్ తైపీ లేదా జపాన్‌తో భారత్ తలపడుతుంది. మహిళల పోరు విషయానికొస్తే నాలుగో సీడ్ జపాన్ జట్టుకు భారత్ దీటైన పోటీనివ్వలేకపోయింది. దీనికి తోడు విదేశీ కోచ్ మాసిమో కొస్టాటినీ లేకపోవడం, టాప్ ర్యాంకర్ ఆకుల శ్రీజను బెంచ్‌పై ఉంచడం భారత్ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది.