కాన్బెర్రా : భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడ్డ అతడు.. రెండ్రోజుల పాటు ఐసీయూలో ఉన్న విషయం విదితమే.
అయితే అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, అయ్యర్‌తో తాను ఫోన్లో మాట్లాడినట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ తెలిపాడు. ‘అయ్యర్ గాయం గురించి తెలిసిన వెంటనే మా ఫిజియోకు ఫోన్ చేశాను. తొలిరోజు అతడు పరిస్థితిని వివరించాడు. రెండ్రోజులుగా అతడితో మాట్లాడుతున్నా’ అని తెలిపాడు.