సెంచూరియన్: ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండవ రోజు వర్షం వల్ల ఆలస్యమవుతోంది. గ్రౌండ్‌పై సూపర్ సోపర్లు నీటిని తొలగిస్తున్నాయి. పిచ్‌పై కవర్స్ కప్పారు. ఇవాళ ఉదయం సెంచూరియన్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో పిచ్ తడిగా మారింది. స్థానిక కాలమానం ప్రకారం 11.30 నిమిషాలకు పిచ్‌ను అంపైర్లు పరిశీలించనున్నారు. ప్రస్తుతం వర్షం నిలిచిపోయింది. త్వరలో మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి రోజు ఇండియా మూడు వికెట్ల నష్టానికి 272 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్ 122, రహానే 40 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.