జొహొర్: సుల్తాన్ ఆఫ్ జొహొర్ హాకీ కప్లో 8వ సారి ఫైనల్ చేరిన భారత జట్టు.. టైటిల్ పోరులో తడబడింది. ఫైనల్లో భారత్ 1-2తో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియా తరఫున ఇయాన్ గ్రాబ్లర్ రెండు గోల్స్ చేయగా భారత్ నుంచి అన్మొల్ ఒక గోల్ చేశాడు.
వరుసగా మూడు ఫైనల్స్లో ఓడిన ఆస్ట్రేలియా.. ఎట్టకేలకు నాలుగో ప్రయత్నం లో తమ టైటిల్ కలను సొంతం చేసుకుంది.