Team India : సొంతగడ్డపై జరుగబోయే వన్డే వరల్డ్ కప్(ODI World Cup)లో భారత మహిళల (Team India) జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. స్థానిక పరిస్థితులను సొమ్ము చేసుకొని ఛాంపియన్లుగా నిలవాలని హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) బృందం గట్టిగానే అనుకుంటోంది. అనుకోవడమే కాదు.. ఈ మెగా టోర్నీ సన్నద్ధతను మరో రెండు రోజుల్లో ప్రారంభించనుంది. హర్మన్‌ప్రీత్ నేతృత్వంలో స్క్వాడ్‌లోని సభ్యులు విశాఖపట్టణంలోని శిక్షణ శిబిరంలో రాటుదేలనున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు వారం రోజుల పాటు జరిగే ఈ ట్రైనింగ్ క్యాంప్‌లో తమ మెలకువలకు మెరుగులు దిద్దుకోనున్నారు.
వరల్డ్ కప్‌లో వైజాగ్ వేదికగా టీమిండియా రెండు కీలక మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో ఒకటి దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 9న, రెండోది ఆస్ట్రేలియాతో అక్టోబర్ 12న. లీగ్ దశలో ఈ రెండింటా విజయం సాధిస్తే భారత్ ముందంజ వేసే అవకాశముంది. అందుకే వైజాగ్ స్టేడియం పిచ్, వాతావరణం మీద అవగాహనకు ఈ శిక్షణ శిబిరం ఉపయోగపడుతుంది. అయితే.. వరల్డ్ కప్ స్క్వాడ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్‌రౌండర్ స్నేహ్ రానా.. ఈ ముగ్గురికి మాత్రమే గతంలో(2014లో) ఈ మైదానంలో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి.. మిగతావాళ్లకు ఇక్కడి పరిస్థితులు అర్దమయ్యేలా వారం రోజులు ఈ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తోంది బీసీసీఐ.
UPDATE – #TeamIndia‘s revised schedule confirmed for ICC Women’s Cricket World Cup.#WomenInBlue #CWC25 pic.twitter.com/aQm8VjgzWV
— BCCI Women (@BCCIWomen) August 22, 2025
వరల్డ్ కప్ స్క్వాడ్‌తో, భారత ఏ జట్టు రెండు డే – నైట్ వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం సెప్టెంబర్ 16 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం టీమిండియా ఛండీగఢ్ వెళ్లనుంది. ఈ సిరీస్ ముగిశాక.. వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌లకు బెంగళూరుకు రానుంది హర్మన్‌ప్రీత్ సేన. సెప్టెంబర్ 25న ఇంగ్లండ్‌తో, సెప్టెంబర్ 27న న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడుతుంది. ఆపై సెప్టెంబర్ 30న గువాహటిలో జరగనున్న వరల్డ్ కప్ ఆరంభ పోరులో శ్రీలంకను ఢీకొట్టనుంది.
వరల్డ్ కప్ స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్.
స్టాండ్ బై : తేజల్ హస్నబిస్, ప్రేమా రావల్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రీ, మిన్ను మణి, సయాలీ సథ్ఘారే.
A power packed #TeamIndia squad for the ICC Women’s Cricket World Cup 2025 💪
Harmanpreet Kaur to lead the 15 member squad 🙌🙌#WomenInBlue | #CWC25 pic.twitter.com/WPXA3AoKOR
— BCCI Women (@BCCIWomen) August 19, 2025