ఇపోహ్ (మలేషియా): ప్రతిష్టాత్మక సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు తొలి పరాభవం ఎదురైంది. బెల్జియం 3-2తో భారత్‌ను ఓడించింది. వర్షం కారణంగా సోమవారం జరగాల్సిన మ్యాచ్ మంగళవారానికి రీషెడ్యూల్ చేయగా భారత జట్టు పోరాడి ఓడింది.
అభిషేక్ (33వ నిమిషంలో), షీలానంద్ (57వ ని.) తలా ఒక గోల్ చేయగా బెల్జియం నుంచి రొమ న్ (17, 57వ ని.) , నికోలస్ (45వ ని.) గోల్స్ సాధించారు. ఈ టోర్నీలో భారత్.. తమ తదుపరి మ్యాచ్‌ను బుధవారం మలేషియాతో ఆడనుంది.