Team India | బెంగళూరు: న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టుల కోసం ఆదివారం భారత జట్టును ప్రకటించారు. యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టులో చోటు కల్పించింది. రంజీ ట్రోఫీలో ప్రస్తుతం ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు తరఫున సుందర్ సెంచరీ(152)తో ఆకట్టుకున్నాడు.
దీనికి తోడు రానున్న ఆసీస్ పర్యటనను దృష్టిలో పెట్టుకున్న సెలెక్టర్లు సుందర్‌కు జట్టులో చోటు కల్పించారు. ఈనెల 24 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య పుణె వేదికగా రెండో టెస్టు మొదలుకానుంది.
జట్టు వివరాలు: రోహిత్(కెప్టెన్), బుమ్రా, జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, సర్ఫరాజ్, పంత్, జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్‌పటేల్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్, సుందర్.