హాంగ్జొ (చైనా):మహిళల ఆసియా కప్ హాకీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్.. 1-1తో జపాన్‌తో పోరును డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచుంటే భారత జట్టు నేరుగా ఫైనల్స్‌కు ప్రవేశించేది.
కానీ డ్రా అవడంతో చైనా, కొరియా మ్యాచ్ ఫలితం కోసం వేచి చూడాల్సి వచ్చింది. అయితే చైనా.. 1-0తో కొరియాను చిత్తుచేయడం భారత్‌కు కలిసొచ్చింది. ఒకవేళ కొరియా గనక 2-0తో గెలిచుంటే భారత్ ఆశలు ఆవిరయ్యేవి. ఆదివారం భారత్.. చైనాతో టైటిల్ పోరులో తలపడనుంది.