మహిళల ఆసియా కప్ హాకీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్.. 1-1తో జపాన్‌తో పోరును డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచుంటే భారత జట్టు నేరుగా ఫైనల్స్‌కు ప్రవేశించేది.
మహిళల ఆసియా కప్ హాకీలో భారత జైత్రయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న మన అమ్మాయిలు.. సూపర్-4 దశలో 4-2తో కొరియాను చిత్తుచేసి సెమీస్‌కు మార్గం సుగమం చేసుకున్నారు.