మోంగ్ కోక్ (హాంకాంగ్): హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టు బోణీ కొట్టింది. మాజీ క్రికెటర్లు ఆడుతున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ పూల్ ‘సీ’లో భారత్.. 2 పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో)తో దాయాది పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత భారత్.. 6 ఓవర్లలో 86/4 స్కోరు చేసింది.
ఊతప్ప (28), చిప్లి (24), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (17*) ధనాధన్ ఆటతో రెచ్చిపోయారు. ఛేదనలో పాక్.. 3 ఓవర్లలో 41/1కు పరిమితమైంది.