సింగపూర్: సింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-17, 21-15తో ప్రపంచ నంబర్‌వన్ జంట గోహ్ జీ ఫీ, నూర్ ఇజుద్దీన్‌పై అద్భుత విజయం సాధించింది. 39 నిమిషాల్లో ముగిసిన పోరులో సాత్విక్, చిరాగ్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే ఈ యువ షట్లర్ల పోరాట పటిమ ఆకట్టుకుంది. తొలి గేమ్ నుంచే తమదైన దూకుడు కనబరిచిన సాత్విక్, చిరాగ్ కండ్లు చెదిరే షాట్లతో పాయింట్లు దక్కించుకున్నారు. రెండో గేమ్‌లోనూ మలేషియా జోడీకి అవకాశమివ్వని మన ద్వయం చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగే సెమీస్‌లో మూడో సీడ్ ఆరోన్ చియా, సోహ్ వు యిక్‌తో తలపడుతుంది.