సొలో (ఇండోనేషియా): బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ల జైత్రయాత్రకు ఫుల్స్టాప్ పడింది. గ్రూప్ దశలో అదరగొట్టిన భారత యువ షట్లర్లు.. కీలకమైన క్వార్టర్స్ పోరులో పోరాడి ఓడారు. సోమవారం జరిగిన క్వార్టర్స్‌లో భారత్.. 104-110తో జపాన్ చేతిలో ఓడింది. ఈ టోర్నీ చరిత్రలో 2011లో పతకం గెలిచిన భారత్.. ఈసారైనా ఆ దిశగా అడుగులు వేస్తుందని భావించినా మనకు మరోసారి నిరాశ తప్పలేదు. క్వార్టర్స్‌లో డబుల్స్ మ్యాచ్‌లలో భారత్ ఆధిపత్యం ప్రదర్శించినా సింగిల్స్ విభాగాల్లో మాత్రం మన షట్లర్లు కీలక సమయాల్లో పట్టు విడవడంతో ఓటమి వైపు నిలువక తప్పలేదు.