టోక్యో: డెఫ్లింపిక్స్లో భారత షూటర్ల ఆధిపత్యం కొనసాగుతున్నది. ఇప్పటికే పలు విభాగాల్లో మన షూటర్లు డజను పతకాలు సాధించగా.. శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో శౌర్య సైనీ రజతంతో మెరిశాడు.
22 ఏండ్ల ఈ కుర్రాడు.. 450.6 పాయింట్లు స్కోరు చేసి సిల్వర్ నెగ్గాడు. జర్మనీ షూటర్ ఎరిక్ హెస్ (459.8) స్వర్ణం గెలిచాడు.