Swapnil Kusale | పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. షూటింగ్ సంచలనం మను భాకర్ ‘డబుల్ మెడల్’ ఇచ్చిన స్ఫూర్తితో ఆయా క్రీడాంశాల్లో విజయాలతో సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ విశ్వ క్రీడలో భారత్‌కు మరో పతకం వరించింది. యువ షూటర్ స్విప్నిల్ కుశల్ (Swapnil Kusale).. 50 మీటర్ల మెన్స్ 3 పొజిషన్ షూటింగ్లో (Mens 50m Rifle) మూడో స్థానంలో నిలిచారు. దీంతో స్వప్నిల్‌కు కాంస్యం (Bronze medal) వరించింది.
బుధవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో 590 పాయింట్లు సాధించిన స్వల్నిల్.. ఏడవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఎక్కువ సంఖ్యలో పది పాయింట్లు కొట్టిన నేపథ్యంలో స్వప్నిల్‌కు ఫైనల్ అర్హత సాధించాడు. ఇక ఇవాళ (గురువారం) ఫైనల్లోనూ సత్తాచాటాడు. 451.4 పాయింట్లతో స్వప్నిల్ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని ముద్దాడాడు. దీంతో ప్రస్తుతం ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మూడుకు చేరింది.
Indian shooter Swapnil Kusale wins Bronze medal at Men’s 50m Rifle #Paris2024Olympic pic.twitter.com/qYKDBEJtPq
— ANI (@ANI) August 1, 2024
Also Read..
Raghav Chadha | ఎన్నికల్లో పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలి.. రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
Delhi Rain | ఢిల్లీలో 24 గంటల్లో 108 మి.మీటర్ల వర్షం.. 1961 తర్వాత ఇదే తొలిసారి