Raghav Chadha | ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ( lowering minimum age to contest polls) ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరమన్నారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రతిపాదన చేశారు.
‘యువ భారతం మనది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలనే నిబంధన ప్రస్తుత కాలానికి సరిపోదు. ప్రస్తుతం దేశ జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారు. ఇక 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారే. దేశానికి స్వాతంత్రం సిద్ధించాక మొదటి లోక్‌సభ ఎన్నికైనప్పుడు 26 శాతం మంది సభ్యులు 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారే. ఇక గత ఎన్నికల్లో 40 ఏళ్లలోపు వారు 12 శాతం మంది మాత్రమే ఎన్నికయ్యారు. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరం. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలి. ఇదే కేంద్ర ప్రభుత్వానికి నా సూచన. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’ అని రాఘవ్ చద్దా అన్నారు.
#WATCH | In Rajya Sabha, AAP MP Raghav Chadha demands the minimum age for contesting elections in India should be reduced from 25 years to 21 years.
He says “India is one of the youngest countries in the world. 65% of our population is less than 35 years old and 50% of our… pic.twitter.com/NjL8p2Qjmb
— ANI (@ANI) August 1, 2024
Also Read..
Cloudbursts | క్లౌడ్ బరస్ట్‌తో చిగురుటాకులా వణికిన హిల్ స్టేట్స్.. 13 మంది మృతి
Delhi Rain | ఢిల్లీలో 24 గంటల్లో 108 మి.మీటర్ల వర్షం.. 1961 తర్వాత ఇదే తొలిసారి