Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో మను భాకర్ (Manu Bhaker) రెండు పతకాలో చరిత్ర సృష్టించిన మరునాడే మరో షూటర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే (Swapnil Kusale) చివరి రౌండ్‌కు అర్హత సాధించాడు. తద్వారా విశ్వ క్రీడల షూటింగ్లో ఫైనల్ చేరిన ఐదో భారత షూటర్‌గా స్వప్నిల్ గుర్తింపు సాధించాడు.
బుధవారం జరిగిన పురుషుల పోటీల్లో స్వప్నిల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. చెక్కుచెదరని గురితో నిలకడగా రాణించి నీలింగ్ రౌండ్లో 198 పాయింట్లు, ప్రొన్ రౌండ్లో 197 పాయింట్లు సాధించి 7వ స్థానంలో నిలిచాడు. దాంతో, ఫైనల్‌కు దూసుకెళ్లి మెడల్‌పై ఆశలు రేపాడు.
🚨 Breaking News! Swapnil Kusale 🇮🇳 shoots an incredible 590 to qualify for the final in Men’s 50m Rifle Three Positions at Paris Olympics! 🏅🔥 #Paris2024 pic.twitter.com/8HwklXT40m
— indianshooting.com (@indianshooting) July 31, 2024
ఆగస్టు 1 గురువారం నాడు ఫైనల్ రౌండ్ జరుగనుంది. ఇదే విభాగంలో పోటీ పడిన భారత షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ (Aishwarya Pratap Singh) మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పేలవ ప్రదర్శనతో 11వ స్థానం దక్కించుకొని మెడల్ అవకాశాన్ని చేజార్చుకుంది.