The Greatest of all time | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తు్న్న ఈ చిత్రం ది గోట్ (The Greatest Of All Time) టైటిల్‌తో వస్తోంది. దళపతి 68 (Thalapathy 68)గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
సెప్టెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ఇంకా నెలకుపైనే సమయం ఉంది. అయితే మూవీ లవర్స్‌తోపాటు విజయ్ అభిమానులను ఖుషి చేసే అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అప్పుడే ది గోట్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా..? యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. పాపులర్ యూకే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అహింసా ఎంటర్టైన్మెంట్స్ యూకేలో బుకింగ్స్ షురూ చేయగా.. సేల్స్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది. బుకింగ్స్ ఇన్ని రోజుల ముందే మొదలవడంతో మరి విజయ్ సినిమా అడ్వాన్స్ సేల్స్ విషయంలో ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందనేది చూడాల్సి ఉంది.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, అరవింద్ ఆకాశ్, ప్రేమ్ గీ అమరేన్, వైభవ్, మనోబాల, వీటీవీ గణేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ది గోట్ చిత్రంలో విజయ్ ఓ వైపు ఓల్డ్ మ్యాన్‌గా, మరోవైపు యంగ్ లుక్‌లో కనిపిస్తున్న లుక్‌తో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
Double iSmart | మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడ్తడు.. డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో రామ్ డబ్బింగ్
Game Changer | బర్త్ డే గాళ్ కియారా అద్వానీకి శుభాకాంక్షలు.. ట్రెండింగ్‌లో గేమ్ ఛేంజర్ నయా లుక్
They Call Him OG | ఏంటీ పవన్ కల్యాణ్ మేకప్ వేసుకునే టైం వచ్చేసిందా..? ఓజీ షూట్‌పై క్రేజీ న్యూస్
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్