Shriyanka Sadangi : భారత యువ షూటర్ శ్రేయాంక సాదంగి ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) బెర్తు దక్కించుకుంది. దాంతో, వచ్చే ఏడాది విశ్వక్రీడలకు అర్హత సాధించిన 13వ షూటర్‌గా శ్రేయాంక నిలిచింది. దక్షిణా కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్న ఆసియా షూటిగ్ చాంపియన్‌షిప్‌లో.. మంగళవారం 50 మీటర్ల 3 పిస్టల్ విభాగంలో శ్రేయాంక నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ విభాగంలో సిఫ్ట్ కౌర్ భారత్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్న మొదటి షూటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
ఆసియా షూటిగ్ చాంపియన్‌షిప్‌లో పోటీపడిన స్టార్ షూటర్ మనూ బాకర్ కూడా ఒలింపిక్స్ బెర్తు సొంతం చేసుకుంది. ఇప్పటికే భారత షూటర్లు రుద్రాంక్షి పాటిల్, స్వప్నిల్ కాసులే, అభిల్ షెరాన్, మెహులీ ఘోష్, రాజేశ్వరీ కుమారి, భూవ్నేష్ మెండిరట్టలు ప్యారిస్ ఆతిథ్యం ఇస్తున్న విశ్వ క్రీడలకు క్వాలిఫై అయ్యారు.