Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో ఆడటంలో విఫలమవుతున్నాడు. ముఖ్యంగా తన బలహీనత అయిన పుల్ షాట్ ప్రత్యర్థి బౌలర్లకు వరంలా మారింది. శ్రేయాస్ ను ఔట్ చేయాలంటే పెద్దగా కష్టపడాల్సిన పన్లేకుండా ఒకే ఓవర్లో నాలుగైదు షాట్ బాల్స్ వేస్తే అతడే ఔట్ అవుతాడనే ధీమాతో ఉన్నారు. ఈ మెగా టోర్నీలో ఇంతవరకు ఆరు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్.. నాలుగు సార్లు ఔట్ కాగా అందులో రెండు పుల్ షాట్ ఆడే క్రమంలో ఔట్ అయినవే కావడం గమనార్హం. గతంలో కూడా అయ్యర్.. పుల్ షాట్ ఆడలేక తంటాలు పడ్డ విషయం తెలిసిందే.
ఇటీవలే ఇంగ్లండ్‌తో లక్నో వేదికగా ముగిసిన మ్యాచ్‌లో కూడా అయ్యర్ షాట్ బాల్కే పెవిలియన్ చేరాడు. 16 బంతులాడిన అతడు.. నాలుగు పరుగులే చేసి క్రిస్ వోక్స్ సంధించిన షాట్ పిచ్ బాల్‌కు నిష్క్రమించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కూడా అయ్యర్ ఇదే రీతిలో పెవిలియన్ చేరాడు. స్పిన్‌తో పాటు పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కునే శ్రేయాస్.. పుల్ షాట్‌ను మాత్రం తన బలహీనంగా మార్చుకున్నాడు. అయితే వరుసగా ఇదే తరహాలో ఔట్ అవుతున్న శ్రేయాస్.. గతంలో పుల్ షాట్ ఎలా ఆడాలనేదానిపై ఓ వీడియో చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
How to play pull shot by Shreyas Iyer
— Shivanshu Singh (@shiva1908) October 29, 2023
‘హౌ టు ప్లే పుల్ షాట్ బై శ్రేయాస్ అయ్యర్’ అని మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే ఒక ట్యూటోరియల్ వీడియో దర్శనమిస్తుంది. అందులో పుల్ షాట్‌ను ఎదుర్కునేప్పుడు కాళ్ల కదలిక ఎలా ఉండాలి..? ఐ కాంటాక్ట్, బాడీ స్టాన్స్, షోల్డర్ పొజిషన్ వంటివి కూలంకశంగా వివరించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు.. పుల్ షాట్ ఎలా ఆడాలో చెప్పిన శ్రేయాస్ అయ్యర్ అదే షాట్ ఆడలేక తంటాలు పడుతూ ప్రతిసారి పెవిలియన్ చేరుతున్నాడు..’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
when a bowler bowls short balls to shreyas Iyer pic.twitter.com/GVYbFtOwfk
— Ramesh (@excricfan) October 30, 2023