ఉఫా (రష్యా): ప్రపంచ జూనియర్ రె జ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీ 76 కిలోల విభాగంలో పోటీ పడిన బిపాషా రజతం సాధించగా.. సిమ్రాన్ (50 కిలోలు), సిటో (55 కిలోలు) కాంస్యాలు నెగ్గారు. గురువారం ఇక్కడ జరిగిన ఫైనల్స్లో కైలీ రెనీ వెల్కర్ (అమెరికా) చేతిలో ఓడిన బిపాషా రజతం చేజిక్కించుకుంది. మరోవైపు 62కిలోల సెమీఫైనల్లో సంజూదేవి 5-2 తేడాతో లుసియాపై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించగా.. భతేరి (65కి) ఫైనల్కు వెళ్లి భారత్కు మరో రెండు పతకాలు ఖాయం చేశారు.