చికాగో (యూఎస్ఏ): వరల్డ్ స్కాష్ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాళ్లు అన్హత్ సింగ్, అభయ్ సింగ్, వీర్ ఛత్రోని, రమిత్ టాండన్ శుభారంభం చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన తొలి రౌండ్ పోటీలలో భాగంగా మహిళల సింగిల్స్‌లో 17 ఏండ్ల అన్హత్.. 3-2 (10-12, 11-9, 6-11, 11-6, 11-6)తో ప్రపంచ 28వ ర్యాంకర్ మరీనా స్టెఫనొని (అమెరికా)కి షాకిచ్చింది.
పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో అభయ్.. 3-2తో నికోలస్ (స్విట్జర్లాండ్)ను చిత్తు చేయగా మరో పోరులో ఛత్రోని.. 3-1తో డెక్లాన్ జేమ్స్ (బ్రిటన్)ను ఓడించాడు. రమిత్.. 3-1తో సుకుయ్ (జపాన్)ను షాకిచ్చి రెండో రౌండ్‌కు ప్రవేశించాడు.