మకావు (చైనా): ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) ప్రపంచకప్‌లో తొలి రోజు భారత ప్యాడ్లర్లు శుభారంభం చేశారు. తెలంగాణ అమ్మాయి శ్రీజ ఆకుల, మరో స్టార్ ప్లేయర్ మనిక బాత్రా తొలి రౌండ్ విఘ్నాన్ని విజయవంతంగా దాటారు.
మహిళల సింగిల్స్‌లో శ్రీజ 3-1తో కాన్సంటిన (ఆస్ట్రేలియా)ను చిత్తు చేసింది. మరో పోరులో మనిక.. 4-0తో మేయ్లిస్ గిరెట్ (ఫ్రాన్స్)పై అలవోక విజయం సాధించి టోర్నీని విజయంతో ఆరంభించింది.