FIH Pro League | భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల జట్టు జోరు కొనసాగుతోంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. 3-1తో ఐర్లాండ్‌ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. మణ్‌దీప్ (22ని.), జర్మన్‌ప్రీత్ (45ని.), సుఖ్జీత్ (58ని.) భారత్‌కు మూడు గోల్స్ అందించారు.
ఐర్లాండ్ నుంచి డంకన్ (8ని.) ఏకైక గోల్ చేశాడు. అమ్మాయిల విషయానికొస్తే భారత్ 0-4తో జర్మనీ చేతిలో ఘోర ఓటమి పాలైంది.