టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల పోరాటానికి తెరపడింది. సింగిల్స్ పోటీలలో దారుణంగా విఫలమైన ఆచంట శరత్ కమాల్, హర్మీత్ దేశాయ్, మానవ్ ఠక్కర్ టీమ్ ఈవెంట్లోనూ చేతులెత్తేశారు. ప్రిక్వార్టర్స్‌లో భారత్ 0-3తో చైనా చేతిలో ఓడింది.
హర్మీత్-మానవ్ తొలి డబుల్స్ ఓడగా సింగిల్స్‌లో తన కెరీర్లో చివరి ఒలింపిక్స్ ఆడుతున్న శరత్ సైతం పరాభవం పాలయ్యాడు. రెండో సింగిల్స్‌లో మానవ్ సైతం నిష్క్రమించడంతో భారత్ కథ ముగిసింది. మహిళల టీటీ జట్టు క్వార్టర్స్ పోరులో భాగంగా బుధవారం జర్మనీతో తలపడనుంది.