ఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో లండన్ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీటీసీ)కు భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి. కొద్దిరోజుల క్రితం ఖాట్మాండులో ముగిసిన సౌత్ ఆసియా రీజినల్ చాంపియన్‌షిప్స్‌లో భారత పురుషుల జట్టు.. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్‌పై గెలిచింది.
మహిళల జట్టు కూడా పైన పేర్కొన్న నాలుగు ప్రత్యర్థులపై విజయాలు సాధించడంతో డబ్ల్యూటీటీసీలో బెర్తు ఖాయం చేసుకుంది.