భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రోలీగ్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు పరాభవం. మంగళవారం కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పురుషుల జట్టు 1-4తో జర్మనీ చేతిలో చిత్తైంది. భారత్ తరఫున గుర్జాంత్ సింగ్ 13వ నిమిషంలోనే తొలి గోల్ కొట్టి భారత్‌ను ఆధిక్యంలోకి తెచ్చినా ఆ తర్వాత జర్మనీ జోరు ముందు ఆతిథ్య జట్టు తేలిపోయింది.
మహిళల విభాగంలో భారత్ 3-4తో స్పెయిన్ చేతిలో పోరాడి ఓడింది. బల్జీత్ కౌర్ (19ని), సాక్షి రాణా (38ని) రుతజ (45ని) గోల్స్ చేశారు. స్పెయిన్ నుంచి ఎస్టెల్ (25ని, 49ని), సోఫియా (21ని), లుసియా (52ని) గోల్స్ కొట్టారు.