షా ఆలమ్(మలేషియా): బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 2-3 తేడాతో చైనా చేతిలో ఓటమిపాలైంది. గురువారం జరిగిన గ్రూపు పోరులో భారత్ ఓటమి వైపు నిలిచింది. సింగిల్స్ తొలి పోరులో ప్రణయ్ 6-21, 21-18, 21-19తో వెంగ్హాంగ్పై గెలువడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మరో సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-11, 21-16తో లీ లాన్జీపై గెలిచిచాడు.
అయితే డబుల్స్‌లో అర్జున్, ధృవ్ జోడీతో పాటు సూరజ్, పృథ్వీ ద్వయం వేర్వేరు గేముల్లో ఓడిపోవడం భారత్ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది.