Vidit Gujarathi : భారత యువ గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ(Vidit Gujarathi ) వివాహ బంధంలో అడుగుపెట్టాడు. వ్యూహాత్మక ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేసే అతడు ఏప్రిల్ 2వ తేదీన మనువాడాడు. బుధవారం హోమియోపతి వైద్యురాలైన నిధి కటారియా(Nidhi Kataria)ను విదిత్ వివాహం చేసుకున్నాడు.
మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కన్నులపండువగా వీళ్ల కల్యాణం జరిగింది. నా జీవితంలో అత్యుత్తమైన రోజు అనే క్యాప్షన్‌తో ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు విదిత్. కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు పలువురు చెస్ క్రీడాకారులు.
విదిత్ సంగీత్ వేడుకలో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ ఛాంపియన్ డి.గుకేశ్‌లు చిందేశారు. విదిత్‌తో కలిసి బాలీవుడ్ పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. నెదర్లాండ్స్ చెస్ ఆటగాడు అనిశ్ గిరీ సతీసమేతంగా హాజరయ్యాడు. కొత్త పెళ్లి కొడుకు విదిత్.. ఏప్రిల్ 7వ తేదీ నుంచి మళ్లీ చదరంగం పోటీల్లో పాల్గొననున్నాడు. ప్యారిస్ వేదికగా జరుగనున్న ఫ్రీ స్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్‌లో బరిలోకి దిగనున్నాడు ఈ గ్రాండ్‌మాస్టర్. ఫిడే ర్యాంకింగ్స్‌లో 25వ ర్యాంక్ సాధించిన విదిత్ ప్యారిస్ గడ్డపై సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.
I AM LAUGHING, CRYING, SCREAMING ALL AT THE SAME….NEVER HAVE I EVER THOUGHT I WOULD SEE GUKESH DANCING IN “BADRI KI DULHANIA” OR VISHY SIR IN “MEIN HOON DON”
VIDIT MADE IT POSSIBLE pic.twitter.com/ZDtkbWh8tC
— _khamoshii_ (@_khamoshii_) April 1, 2025