అర్వపల్లి, ఏప్రిల్ 03 : అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనుభవజ్ఞులైన డాక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్స్చే గర్భిణులకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని అ అవకాశాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ బి.నగేశ్నాయక్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. గర్భిణీలకు సాధారణ ప్రసవాల వల్ల శారీరక అలాగే ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయన్నారు.
అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సంవత్సరం జనవరి 2025 నుండి ఏప్రిల్ వరకు ఏడు సాధారణ ప్రసవాలు జరిగినట్లు చెప్పారు. ప్రసవాలకు ప్రైవేట్ హాస్పిటల్కు పోకుండా అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లభించే సేవలను గర్భిణులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.