వుంగ్ తౌ(వియత్నాం): వియత్నాం వేదికగా జరుగుతున్న అండర్-23 ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత అమ్మాయిలు పతక జోరు కనబరిచారు. బరిలోకి దిగిన పది కేటగిరీల్లో మహిళా రెజ్లర్లు నాలుగు స్వర్ణాలు సహా ఐదు రజతాలు, కాంస్యం కైవసం చేసుకున్నారు. ప్రియాంశి(50కి), రీనా(55కి), శ్రిస్తి(68కి), ప్రియ(76కి) పసిడి పతకాలతో మెరిశారు.
నేహా శర్మ(57కి), తన్వి (59కి), ప్రగతి(62కి), శిక్షా(65కి),జ్యోతి బెర్వాల్(72కి) ప్రత్యర్థుల చేతుల్లో ఓడి రజతాలతో సంతృప్తి పడ్డా రు. మరోవైపు పురుషుల గ్రీకోరోమన్ విభాగంలో సుమిత్(63కి) స్వర్ణం సాధించగా, నితేశ్(97కి), అంకిత్(72కి) కాంస్యాలు సొంతం చేసుకున్నారు. ఫ్రీస్టయిల్ ఈవెంట్లో వికీ(97కి) పసిడి కైవసం చేసుకున్నాడు.